తెలంగాణలో సెటప్, IAS కావడం కోసం IPS ఆఫీసర్ హైటెక్ కాపీయింగ్
- October 31, 2017
తమిళనాడులో ఎగ్జామ్. తెలంగాణలో సెటప్. అక్కడి నుంచి ప్రశ్నలు వస్తే.. ఇక్కడి నుంచి సమాధానాలు వెళ్లాయి. IAS కావడం కోసం IPS ఆఫీసర్ హైటెక్ కాపీయింగ్‌కు పాల్పడ్డాడు. కట్ చేస్తే.. కటకటాలు లెక్కిస్తున్నాడు. అతడి భార్య, కోచింగ్ సెంటర్ డైరెక్టర్ కూడా అరెస్ట్ అయ్యారు. ఆ ముగ్గురితోనే ముడి పడిందా? లేక.. హైటెక్ కాపీయింగ్ వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అనే దిశగా కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
సఫీర్ కరీం. IPS. తమిళనాడు తిరునల్వేలి జిల్లా ASP. మంచి జీతం. మంచి హోదా. అయినా.. సంతృప్తి లేదు. IAS కావాలనే ఆశతో అడ్డదారి తొక్కి అడ్డంగా బుక్కైపోయాడు. సంచలనం సృష్టించిన హైటెక్ కాపీయింగ్ కేసులో అరెస్టై ఊచలు లెక్కబెడుతున్నాడు. UPSC పరీక్ష జరిగింది తమిళనాడులోనైనా.. కథ నడిచింది హైదరాబాద్ నుంచే కావడంతో ఇక్కడా అలజడి నెలకొంది.
చెన్నై నుంచి వచ్చిన సమాచారం మేరకు.. కరీంకు సహకరించిన అతడి భార్య జాయిస్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైటెక్ కాపీయింగ్‌లో సఫీర్ కరీంకు సహకరించిన రాంబాబును సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. అశోక్‌నగర్‌లోని "లా ఎక్స్‌లెన్స్ IAS స్టడీ సర్కిల్"లో తనిఖీలు చేశారు. అకాడమీ డైరెక్టర్ రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. జాయిస్, రాంబాబులను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. అనంతరం ట్రాన్సిట్ వారెంట్‌పై చెన్నైకి తరలించారు. హైటెక్ కాపీయింగ్‌పై సమగ్ర విచారణ కొనసాగుతోందని తమిళనాడు డీసీపీ అరవిందన్ తెలిపారు.
కాపీయింగ్ కేసులో అరెస్ట్ అయిన కరీం, రాంబాబుల స్నేహం ఇక్కడితోనే ఆగిపోలేదు. వీరిద్దరూ కలిసి కేరళలో.. కరీం లా స్టడీ సర్కిల్ పేరుతో సివిల్స్ కోచింగ్ సెంటర్ పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో.. ఈ హైటెక్ కాపీయింగ్ కరీం ఒక్కడికే పరిమితమైందా? లేక.. మరికొందరూ ఇదే తరహా కాపీయింగ్‌కు పాల్పడ్డారా? అనే దిశగానూ విచారణ చేస్తున్నారు. మెయిన్స్ పరీక్ష రాస్తుండగా పట్టుబడిన సఫీర్ కరీం.. తాను ప్రిలిమ్స్‌లోనూ ఇదే విధంగా కాపీయింగ్‌కు పాల్పడినట్టు ఒప్పుకున్నాడు. ఇప్పటికే ఐపీఎస్‌కు సెలెక్ట్ అయి.. ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న కరీం.. గత ఐపీఎస్ పరీక్షలోనూ ఇదే విధంగా కాపీయింగ్ చేశాడా? లేదా? అనే దిశగానూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!