అగ్ని ప్రమాదం: మూడు అపార్ట్‌మెంట్లలో అగ్ని కీలలు

- October 31, 2017 , by Maagulf
అగ్ని ప్రమాదం: మూడు అపార్ట్‌మెంట్లలో అగ్ని కీలలు

షార్జాలోని ఐదంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో మూడు అపార్ట్‌మెంట్లలో అగ్నికీలలు వ్యాపించాయి. షార్జా సిటీ సెంటర్‌ వెనుకాల ఉన్న ఇండస్ట్రియల్‌ ఏరియా నెంబర్‌ వన్‌లో ఈ భవనం ఉంది. మధ్యాహ్నం 1.40 నిమిషాల సమయంలో ఓ అపార్ట్‌మెంట్‌లోని కిచెన్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా, క్షణాల్లోనే ఆ మంటలు మిగతా అపార్ట్‌మెంట్స్‌కి వ్యాపించాయి. ఫైర్‌ ఫైటర్స్‌, అగ్ని కీలలతో 30 నిమిషాల పాటు పోరాడి, మంటల్ని అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం సంభవించలేదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com