భార్యా పిల్లలకు యూఏఈలో రెసిడెన్సీ వీసా పొందడమెలా?
- November 01, 2017
యూఏఈకి వచ్చే వలసదారులకు తమ కుటుంబాల్ని తీసుకురావడం పెద్ద సమస్యగా మారుతోంది. ఆర్థిక భారంతో కూడుకున్న విషయమిది. ఒంటరిగా యూఏఈకి వచ్చి, కుటుంబానికి దూరంగా ఉండడం కూడా వర్ణనాతీతమైన ఇబ్బంది అని చెప్పక తప్పదు. నెలవారీ జీతం 4,000 దిర్హామ్‌లు లేదా 3,000 దిర్హామ్‌ల జీతం, ప్లస్ అకామడేషన్ ఉంటే భార్యా, పిల్లల్ని యూఏఈకి తీసుకురావొచ్చు. వారితో హ్యాపీగా జీవనం సాగించవచ్చు. అదే తల్లిదండ్రుల్ని కూడా తీసుకురావాలంటే మాత్రం జీతం 20,000 దిర్హామ్‌లు తప్పనిసరి. యూఏఈకి వారిని తీసుకురావడం కోసంముందుగా ఎంట్రీ రెసిడెన్స్ వీసా పొందవలసి ఉంటుంది. వారు యూఏఈకి వచ్చిన తర్వాత 30 రోజుల్లోగా రెసిడెన్స్ స్టాంప్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టైప్ చేసిన అప్లికేషన్ ఫామ్, సేలరీ సర్టిఫికెట్, లేబర్ కార్డ్, లేబర్ కాంట్రాక్ట్, మ్యారేజీ సర్టిఫికెట్ (అటెస్టెడ్), పిల్లల బర్త్ సర్టిఫికెట్స్ (అటెస్టెడ్), మూడు నెలల బ్యాంక్ స్టేట్మెంట్, అటెస్టెడ్ టెనెన్సీ కాంట్రాక్ట్, ఎమిరేట్స్ ఐడీ తప్పనిసరి. మ్యారేజ్ సర్టిఫికెట్‌పై ఆయా దేశాల్లోని సంబంధిత మినిస్ట్రీ అటెస్టేషన్ తప్పనిసరి. చివరగా యూఏఈ ఎంబసీ లేదా కాన్సులేట్‌లో స్టాంపింగ్ అవ్వాల్సి ఉంటుంది. యూఏఈలో సంబంధిత మినిస్ట్రీ ద్వారా క్రాస్ అటెస్టెడ్ చేయబడాలి. రెసిడెన్సీ వీసా పొందాక, యూఈఏ వెలుపల ఆరు నెలలకు మించి ఒకేసారి ఉండకూడదు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!