25 ఏళ్ల తర్వాత రాంగోపాల్ వర్మ తో కింగ్ నాగార్జున ముహూర్తం ఫిక్స్

- November 02, 2017 , by Maagulf
25 ఏళ్ల తర్వాత రాంగోపాల్ వర్మ తో  కింగ్ నాగార్జున ముహూర్తం ఫిక్స్

నాగ్, వర్మ-శివ....టాలీవుడ్లోనే కాదు నేషనల్ వైడ్ గా ఈ సినిమాకున్న క్రేజ్ మామూలుది కాది. ఒక ట్రెండ్ సెట్టర్. నాగార్జునని సూపర్ స్టార్ ని చేసింది శివ. ఇక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ శివతో నేషనల్ ఫిగర్ అయిపోయాడు. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో గోవిందా గోవిందా వచ్చింది కానీ నిరాశపరచింది. మళ్ళీ ఇన్నేళ్లకు శివ కాంబినేషన్లో మరో సినిమా రాబోతుంది.
శివ చిత్రంతో ట్రెండ్ సెట్టర్ గా మారిన వర్మ, చాలా కాలం తర్వాత నాగార్జునతో సినిమాకి ప్లాన్ చేశాడు. నాగ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు ఆ మూవీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 25 ఏళ్ళ తర్వాత శివ కాంబినేషన్లో సినిమా వస్తుండటంతో ఆడియన్స్ లోనూ క్యూరియాసిటీ ఏర్పడింది.

వర్మ దర్శకత్వంలో నాగార్జున చేయబోయే సినిమాని అన్నపూర్ణా స్టూడియోలో స్టార్ట్ చేయడానికి డేట్ ఫిక్స్ చేశారు. ఈ నెల 20న ఈ మూవీని పట్టాలెక్కించబోతున్నారు. అయితే ఈ సారి వర్మ, నాగార్జునని ఎలా ప్రజెంట్ చేస్తాడు, ఎలాంటి కథ చెప్పబోతున్నాడనే విషయాలు మాత్రం తెలియనివ్వడంలేదు. ఇంత కాలం తర్వాత సినిమా చేస్తున్న వర్మ, నాగార్జున మళ్ళీ శివ మ్యాజిక్ రిపీట్ చేస్తారేమో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com