హాలీవుడ్ స్టైల్‌లో "అక్రమ్ " నిర్మాణం
- November 02, 2017
నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి అచ్చ తెలుగు నేలపై... హాలీవుడ్ తరహాలో నిర్మిoచబడిన సినిమా "అక్రమ్". ఈ సినిమా టీజర్ రిలీజ్ ఫంక్షన్ విజయవాడలోని ఒక స్టార్ హోటల్ లో ఘనంగా జరిగింది. మేడిది సురేష్ హీరోగా డాన్ నేపథ్యంలో సాగే అక్రమ్ సినిమాపై ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ నడుస్తోంది. పూర్తిగా అమరావతి, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా తీస్తున్నారు. అమరావతిని ఏపీ సిఎం చంద్రబాబు ప్రపంచ దేశాలు నివ్వెరపోయేలా నిర్మించే ప్రయత్నంలో ఉండగా, ఇక్కడ రాజధాని "అమరావతి మూవీస్" బ్యానర్ పై "అక్రమ్" చిత్రం అంతర్జాతీ స్థాయి ప్రమాణాలతో హాలీవుడ్ తరహాలో రూపొందుతోంది. సినిమా నిర్మాణ సమయంలోనే...అశేషంగా, విశేషంగా ప్రజాదరణ పొందుతోంది. సినీ అభిమానుల అందరి నోటా ఒకటే మాట... అసలు ఎవరీ అక్రమ్? ఆయన చూపు ఇపుడు ఈ స్టేట్ పై ఎందుకు పడింది... ఈ డాన్ ఏం చేయబోతున్నాడు... తెలుగు సినీ ఇండస్ట్రీని ఎలా కుదిపేయబోతున్నాడు... ఇదే ఇపుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. అన్నారు... టీజర్ రిలీజ్ చేసిన ప్రముఖ సినీ నిర్మాత అంబికా కృష్ణ. అమరావతిలో నిర్మిస్తున్న తొలి యాక్షన్ చిత్రమిదని, టీజర్ చూస్తే అక్రమ్ సురేష్ టాలీవుడ్ ని షేక్ చేస్తాడనిపిస్తోందన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …