మసాజ్ సెంటర్లో దోపిడీ: ముగ్గురికి జైలు శిక్ష
- November 03, 2017
ముగ్గురు పాకిస్తానీ వ్యక్తులు, ఓ మసాజ్ సెంటర్లోకి చొరబడి, సిబ్బందిని దోచుకున్న ఘటనకు సంబంధించి నిందితులు ముగ్గురికీ చెరో రెండేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. 21, 19, 21 ఏళ్ళ వయసున్న ముగ్గురు నిందితుల్ని ఈ కేసులో దోషులుగా తేల్చింది న్యాయస్థానం. జైలు శిక్ష అనంతరం ఈ ముగ్గురినీ దేశం నుంచి బహిష్కరించాలని కూడా న్యాయస్థానం ఆదేశించడం జరిగింది. 2016 నవంబర్ 14న ఈ ఘటన చోటు చేసుకుంది. మసాజ్ సెంటర్లో సిబ్బంది మెడ మీద కత్తి పెట్టి, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లను నిందితులు దొంగిలించారు. మసాజ్ సెంటర్లో పనిచేస్తున్న 34 ఏళ్ళ ఫిలిప్పినా, దొంగతనం జరిగిన వైనాన్ని న్యాయస్థానానికి తెలియజేశారు. సంఘటనా స్థలం నుంచి ఫింగర్ ప్రింట్స్ని సేకరించడం ద్వారా నిందితుల్ని పోలీసులు ట్రాక్ చేయగలిగారు. న్యాయస్థానం విధించిన తీర్పుని 15 రోజుల్లోగా అప్పీల్ చేసుకునే అవకాశం నిందితులకు ఉంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







