డబుల్ డెక్కర్ బస్ని లాగిన దుబాయ్ 'బలవాన్'
- November 04, 2017
దుబాయ్ నివాసితుడొకరు, దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్‌ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్ళారు. ఆయన లాఘవంగా ఓ డబుల్ డెక్కర్ బస్ని లాగి అందర్నీ ఆశ్చర్యపరిచారు. దుబాయ్‌లోని ఓపెన్ గ్రౌండ్లో డబుల్ డెక్కర్ బస్సుని కొంత దూరం వరకు లాగారాయన. డబుల్ డెక్కర్ బస్సు బరువు 12.6 టన్నులు ఉంటుంది. ఈ విషయాన్ని రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ (ఆర్టిఎ) సోషల్ మీడియాలో వెల్లడించింది. ఇటీవలే ఫిట్నెస్ ఛాలెంజ్‌లో భాగంగా కొందరు స్కైడైవ్ చేసి అందర్నీ ఆశ్చర్యపిరిచన సంగతి తెలిసినదే. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ఫిట్నెస్ ఛాలెంజ్ పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 30 రోజులపాటు ఈ కార్యక్రమం సాగనుంది. ఫిట్నెస్ పట్ల అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని క్రౌన్ ప్రిన్స్ ప్రారంభించారు. అక్టోబర్ 20న ప్రారంభమైన ఈ కార్యక్రమం నవంబర్ 18వ తేదీతో ముగుస్తుంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!