ఆన్ కాస్ట్ నుండి టీచర్స్ డే గ్రీటింగ్స్ పోటీ విజేతలు బహుమతులు స్వీకరణ

- November 05, 2017 , by Maagulf
ఆన్ కాస్ట్ నుండి టీచర్స్ డే గ్రీటింగ్స్ పోటీ విజేతలు బహుమతులు స్వీకరణ

కువైట్: ఆన్ కాస్ట్  సూపర్ మార్కెట్ సహకారంతో ఎల్ ఎల్ కె  నిర్వహించిన పోటీలో  టీచర్స్ డే విజేతలకు కువైట్ సిటీలో లిమానేడ్ ఆఫీసు వద్ద జరిగిన కార్యక్రమంలో వారికి ఆ  బహుమతులు అందచేశారు. ఉపాధ్యాయుల దినోత్సవంలో వివిధ పాఠశాలల విద్యార్థులకు వారి ఉపాధ్యాయులను సన్మానించుకొనే  ఈ పోటీ ఓ చక్కని అవకాశం ఇచ్చింది. మొదటి బహుమతి విజేతగా ఎలిజా ప్రకటించబడింది.  విలియమ్ మెల్రాయ్ మరియు కెవిన్ ఫెర్నాండెజ్ ద్వితీయ, తృతీయ బహుమతులను పొందారు. ప్రకటించబడే ఇండియన్ ఇంగ్లీష్ అకాడమీ స్కూల్ నుండి శ్రీ  జయరాం మినీను "మై ఫేవౌరట టీచర్" గా ప్రకటించారు. మొదటి బహుమతి గ్రహీతకు 50 కువైట్ దినార్లు,  ద్వితీయ , తృతీయ బహుమతుల విజేతలకు 25 కువైట్ దినార్లు గిఫ్ట్ ఓచర్  / - బహుమతి ఓచర్ మరియు అభిమాన ఉపాధ్యాయునికి   50 కువైట్ దినార్లు ఆన్ కాస్ట్ నుండి అందచేయబడింది.  విజేతలకు బహుమతులను శ్రీమతి నూర్ మొహమాద్,ఎల్ ఎల్ కె అధికారులు సమక్షంలో  ఆన్ కాస్ట్  మార్కెటింగ్ ఆఫీసర్లు అందచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com