లోపాలుగల బస్ అమ్మకం: డీలర్‌కి జైలు, జరీమానా
- November 05, 2017
మస్కట్: లోపాలుగల బస్‌ని అమ్మినందుకు, సరైన రీతిలో దాన్ని రిపెయిర్ చెయ్యనందుకుగాను ఓ డీలర్‌కి ఆరు నెలల జైలు శిక్ష అలాగే, 1000 ఒమన్ రియాల్స్ జరీమానా విధించింది న్యాయస్థానం. పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్, వాహన డీలర్‌ని న్యాయస్థానానికి తీసుకెళ్ళింది, వినియోగదారుడి ఫిర్యాదుతో. 25 సీటర్ బస్‌కి సంబంధించిన స్టీరింగ్ బ్యాలెన్స్ లేకపోవడం, చక్రాల నుంచి పొగ, ఆయిల్ వస్తుండడంతో డీలర్‌కి ఫిర్యాదు చేయగా, సమస్యను పరిష్కరించలేదు. ఈ నేపథ్యంలో నిజ్వా కోర్ట్ ఆఫ్‌ఫస్ట్ ఇన్‌స్టాన్స్ తీర్పునిస్తూ, డీలర్‌ది తప్పని తేల్చింది. డీలర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ చట్టాన్ని ఉల్లంఘించినట్లు న్యాయస్థానం పేర్కొంది. వినియోగదారుడు, అంతకు ముందు అల్ దక్లియా ప్రావిన్స్‌లోని కన్స్యుమర్ వాచ్‌డాగ్స్‌ని సంప్రదించి, తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. డీలర్ తక్షణమే 300 ఒమన్ రియాల్స్ లీగల్ ఖర్చుల కింద చెల్లించాలని కూడా డీలర్‌ని ఆదేశించింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!