బహ్రెయిన్‌లో ముగిసిన ఇండియన్‌ ప్రాపర్టీ షో

- November 05, 2017 , by Maagulf
బహ్రెయిన్‌లో ముగిసిన ఇండియన్‌ ప్రాపర్టీ షో

మనామా: 6వ ఎడిషన్‌ ప్రాపర్టీ షో ముగిసింది. బహ్రెయిన్‌లో బిగ్గెస్ట్‌ ఇండియన్‌ ప్రాపర్టీ షోగా ఈ ఈవెంట్‌ని నిర్వహించారు. రెండ్రోజులపాటు ఈ ప్రాపర్టీ షో జరిగింది. నవంబర్‌ 3న బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ అండ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ ప్రాపర్టీ షోని నిర్వహించారు. గాలూర్‌ ఐడియాస్‌, ఇన్‌సైట్‌, ప్రాపిన్‌ కేరళ డాట్‌ కామ్‌, టైమ్‌ రియాల్టీ సంయుక్తంగా ఈ షో నిర్వహించగా, బహ్రెయిన్‌లో ఇండియన్‌ ఎంబసీ అండర్‌ సెక్రెటరీ ఓం ప్రకాష్‌ ప్రారంభించారు. 6వ ఎడిషన్‌ ప్రాపర్టీ షో - 2017 సూపర్‌ సక్సెస్‌ అయ్యిందని గాలూర్‌ సీఈఓ గౌరవ్‌ భాసిన్‌ చెప్పారు. 2500 మందికి పైగా సందర్శకులు ఎగ్జిబిషన్‌ని సందర్శించినట్లు చెప్పారు. సౌదీ అరేబియా నుంచి కూడా పలువురు సందర్శకులు ఎగ్జిబిషన్‌ని సందర్శించడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్‌లో 30 మిలియన్‌ డాలర్ల విలువైన బుకింగ్స్‌ జరిగాయని గౌరవ్‌ తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com