అమెరికాలో ఓ మహిళకు ఒకే రోజు రెండు లాటరీలు
- November 05, 2017
అమెరికాలో ఓ మహిళకు ఒకే రోజు రెండు లాటరీల్లో భారీగా డబ్బులు వచ్చాయి.ఉత్తర కరోలినాలో ఇటీవల డైమండ్ డ్యాజ్లర్ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసిన కింబర్లీ మోరిస్.. రూ.6.4లక్షల నగదును గెలుచుకొంది.
ఈ మొత్తాన్ని స్వీకరించిన ఆమె.. వెంటనే రెండోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. రూ.1300 వెచ్చించి మరో టికెట్ కొనుగోలు చేశారు. దీనికి రూ.6.47 కోట్ల నగదు బహుమతి తగలడంతో.. ఆమె ఆనందం పదింతలైంది.
విడతలవారీగా కాకుండా ఒకేసారి నగదు మొత్తాన్ని తీసుకోవాలని ఆమె నిర్ణయించుకోవచ్చని భావించి ఆమె రెండో లాటరీ టిక్కెట్టును కొనుగోలు చేసింది... పన్నులు పోనూ రూ.2.5 కోట్లు ఆమె ఖాతాకు చేరాయి. పెద్ద మొత్తాన్ని గెలుచుకుంటానని తానెప్పుడూ కల కనేదాన్నని.. అందుకే రెండో టికెట్ కొన్నానని కింబర్లీ చెప్పారు.
ఒకేరోజు రెండు లాటరీల్లో ఆమెకు భారీగా డబ్బులు రావడంతో ఆమెతో పాటు ఆమె కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇలాంటి ఘటనలు అరుదుగా చోటుచేసుకొంటాయి.
తాజా వార్తలు
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!