నవంబర్ 17న వస్తానంటోన్న 'దేవిశ్రీ ప్రసాద్'
- November 06, 2017
యశ్వంత్ మూవీస్ సమర్పణలో, ఆర్ ఓ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న చిత్రం దేవిశ్రీప్రసాద్. పూజా రామచంద్రన్, భూపాల్, ధనరాజ్, మనోజ్ నందన్ ప్రధాన పాత్రలుగా పోషిస్తున్న ఈ చిత్రానికి శ్రీ కిషోర్ దర్శకుడు. డి.వెంకటేష్, ఆర్.వి.రాజు, ఆక్రోష్ నిర్మాతలు. ఈ సినిమా నవంబర్ 17న విడుదల కానుంది. ఈ సందర్బంగా ...
దర్శక నిర్మాతలు మాట్లాడుతూ - "సినిమా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ముందుగా సినిమాను నవంబర్ 10న విడుదల చేయాలని అనుకున్నప్పటికీ..కొన్ని అనివార్య కారణాల కారణంగా ఓ వారం పాటు వాయిదా వేశాం. కాబట్టి సినిమాను నవంబర్ 17న పెద్ద ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. పూజా రామచంద్రన్, భూపాల్, ధనరాజ్, మనోజ్ నందన్ల నటన ఆద్యంతం ఆకట్టుకునే ఆసక్తికరంగా సాగుతుంది. కొత్తదనం కోరుకునే తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది" అన్నారు.
పూజా రామచంద్రన్, భూపాల్ రాజు, ధనరాజ్, మనోజ్ నందం, పోసాని కృష్ణమురళి, వేణు టిల్లు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: కమ్రాన్, కెమెరాః ఫణీంద్ర వర్మ అల్లూరి, ఎడిటింగ్ః చంద్రమౌళి.ఎం, మాటలుః శేఖర్ విఖ్యాత్, శ్రీ కిషోర్, లైన్ ప్రొడ్యూసర్ః చంద్ర వట్టికూటి, నిర్మాతలుః డి.వెంకటేష్, ఆర్.వి.రాజు, ఆక్రోష్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: శ్రీ కిషోర్.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!