దేశంలో ప్యారడైజ్‌ పేపర్ల ప్రకంపనలు

- November 06, 2017 , by Maagulf
దేశంలో ప్యారడైజ్‌ పేపర్ల ప్రకంపనలు

దేశంలో ప్యారడైజ్‌ పేపర్ల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ట్యాక్స్‌లు ఎగ్గొట్టేందుకు అడ్డదార్లు తొక్కారంటూ 714 మంది ప్రముఖల పేర్లు బయటకొచ్చాయి. వారిపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. మల్టీ ఏజెన్సీ గ్రూప్ ఈ అంశాన్ని చూస్తుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్‌ డైరెక్ట్ ట్యాక్సెస్‌-CBDT అధికారులు స్పష్టం చేశారు. ఇందులో CBDT, ఈడీ, రిజర్వ్‌బ్యాంక్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌కు చెందిన అధికారులు సభ్యులుగా ఉంటారు. ఆదాయపు పన్ను శాఖను అప్రమత్తం చేశారు. ఈ మల్టీ ఏజెన్సీ గ్రూప్‌ గతేడాది ఏప్రిల్‌లో ఏర్పాటైంది. అక్రమ మార్గాల్లో పన్ను ఎగవేశారంటూ పనామా పేపర్స్‌ బయటకు రావడంతో.. వాటిపై విచారణ జరుపుతోంది. దానికే.. ప్యారడైజ్ పేర్లను అప్పగించారు. మరి, నిజానిజాలను ఎప్పుడు నిగ్గు తేలుస్తారనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com