లక్ష మందికి ఐటీ నోటీసులు అందనున్నాయి
- November 07, 2017
ఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకు ఖాతాల్లో అధిక మొత్తంలో నగదు జమ చేసిన దాదాపు లక్ష మంది వ్యక్తులు, సంస్థలకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు పంపించనున్నారు. ఈ వారంలోనే వాళ్లందరికీ నోటీసులు పంపించనున్నట్లు అధికారులు వెల్లడించారు. రూ.50లక్షల నగదును బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసిన 70వేల మందికి మొదటగా నోటీసులు అందనున్నాయి. ఐటీ యాక్ట్ సెక్షన్ 142(1) కింద ఆదాయపు పన్ను శాఖ ఈ నోటీసులు జారీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరిపిన వారి గత ప్రవర్తనను పరిశీలనలోకి తీసుకుని మరో 30వేల మందికి కూడా ఈ నోటీసులు అందనున్నాయి. రూ.25లక్షల నుంచి రూ.50లక్షల మధ్య నగదు డిపాజిట్లు చేసిన వారికి ఈ నోటీసులు అందనున్నాయి. ఆపరేషన్ క్లీన్ మనీలో భాగంగానే ఈ నోటీసులు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!