'నిర్భయ్' క్షిపణి విజయవంతం
- November 07, 2017
సుదీర్ఘ దూరం ప్రయాణించే నిర్భయ్ క్షిపణిని భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. 300 కేజీల వార్‌హెడ్స్‌ను మోసుకుపోగల ఈ క్షిపణిని స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఒడిశా తీరం చాందీపూర్‌లోని కాంప్లెక్-3 ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఉదయం 11.20కి దీన్ని పరీక్షించినట్టు డిఆర్‌డివో అధికారులు వెల్లడించారు. సబ్ సోనిక్ మిసైల్ క్యాటగిరీ కింద 2013లోనే క్షిపణిని రూపొందించి, ఇప్పటికే నాలుగుసార్లు పరీక్షించారు. అయితే, నాలుగింట ఒక్కసారే క్షిపణి పరీక్ష విజయవంతమైంది. తాజాగా మంగళవారం జరిపిన పరీక్ష విజయవంతమైందని డిఆర్‌డివో అధికారులు ఆనందంతో వెల్లడించారు. ఆడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లేబరేటరీ ప్రత్యేకంగా రూపొందించిన సాలిడ్ రాకెట్ మోటార్ బూస్టర్‌ను నిర్భయ్ పరీక్ష కోసం వాడినట్టు చెప్పారు. వెయ్యి కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని చేధించగల ఈ క్షిపణి శబ్ధవేగం కంటే కాస్త తక్కువ వేగంతో మాత్రమే ప్రయాణిస్తుంది. టర్భోజెట్ ఇంజన్‌తో పని చేసే నిర్భయ్, నావిగేషన్ విధానంలో లక్ష్యాన్ని ఖచ్చితంగా చేధించేలా ఆర్‌సిఐ (ఇమారత్ రీసెర్చ్ సెంటర్) శాస్తవ్రేత్తలు రూపొందించారని డిఆర్‌డివో అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!