ఒగ్గు కథ పితామహుడు ఇక మనకు లేరు
- November 09, 2017
ఒగ్గుకథ పితామహుడు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత చుక్క సత్తయ్య కన్నుమూశారు. జానపద కళారూపమైన ఒగ్గు కథ చెప్పడంలో చుక్క సత్తయ్య ప్రవీణుడు. జిల్లాలోని లింగాల ఘణపురం మండలం మాణిక్యపురం గ్రామాంలో ఓ సామాన్య కుటుంబానికి చెందిన ఆయన ఒగ్గు కథకు వన్నె తెచ్చారు. దేశవ్యాప్తంగా ఒగ్గు కథకు పేరు తెచ్చిన ఆయన రాష్ట్రపతి అవార్డుతో పాటు ఎన్నో జాతీయ అవార్డులు అందుకున్నారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్తయ్య గురువారం తన ఇంట్లో తుది శ్వాసవిడిచారు.
ఒగ్గు కథా గాన శైలిలో అనేక సామాజిక రుగ్మతలకు సంబంధించిన అంశాలపైన కూడా ఆయన పోరాటం చేశారు. ఉన్నత విద్య, ఫ్యామిలీ ప్లానింగ్, కట్న వ్యవస్థ, మూఢనమ్మకాలు, చెడు అలవాట్ల లాంటిపైన కూడా ఆయన ఒగ్గు కథతో ప్రదర్శనలు చేశారు. జనగామ కేంద్రంగా జ్యోతిర్మయి లలిత కళా సమితిని ఏర్పాటు చేశారు. ఒగ్గుకథ, ఒగ్గు డొళ్లు శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసి ఔత్సాహిక కళాకారులకు శిక్షణ ఇస్తున్నారు.
కాగా చుక్కా సత్తయ్య మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. సత్తయ్య తెలంగాణతో పాటు దేశం గర్వించదగ్గ కళాకారుడని కొనియాడారు. ఆయన మరణం తెలంగాణకు తీరని లోటు అని పేర్కొన్నారు. సత్తయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!