షార్జాలో కాలిన బోటు: తప్పిన ప్రమాదం
- November 09, 2017
షార్జా సివిల్ డిఫెన్స్ ఫైర్ ఫైటర్స్ చాకచక్యంగా వ్యవహరించి, షార్జా క్రీక్ - ఖాలిద్ పోర్ట్లో అగ్ని ప్రమాదానికి గురైన బోటులో మంటల్ని ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని షార్జా సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ కల్నల్ సమి అల్ నక్బి చెప్పారు. ఉదయం 11.30 గంటల సమయంలో యాంకర్ చేసిన ఉడెన్ బోట్కి అగ్ని ప్రమాదం సంభవించినట్లు సమాచారం అందుకుంది సివిల్ డిఫెన్స్. సమాచారం అందగానే, ఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు. బలమైన గాలుల కారణంగా 30 నిమిషాల సమయం పట్టింది మంటల్ని ఆరప్పడానికి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ టీమ్ ప్రమాదానికి గల కారణాల్ని అన్వేషిస్తోంది. పేలుడు స్వభావం గల వస్తువుల్ని తరలించే క్రమంలో సిబ్బంది నిర్లక్ష్యం ఇలాంటి ప్రమాదాలకు కారణమని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!