భారతీయులకు ఇల్లు అద్దెకివ్వం అంటున్న బ్రిటన్ వాసులు
- November 09, 2017
వాసనలు వెంటాడే కూరలు వండుకునే భారతీయులు, పాకిస్థానీలకు ఇళ్లు అద్దెకు ఇవ్వనంటూ భీష్మించుకుని కూర్చున్న బ్రిటన్వాసికి కోర్టులో చుక్కెదురైంది. 69ఏళ్ల ఫెర్జస్ విల్సన్‌కు ఈశాన్య ఇంగ్లండ్‌లో వందల కొద్దీ ఇళ్లున్నాయి. భారత్, పాకిస్థాన్‌లకు చెందిన ఓ వర్ణం ఛాయ కలిగిన వ్యక్తులకు ఇళ్లు అద్దెకు ఇవ్వనని సమానత్వం, మానవ హక్కుల కమిషన్ ముందు ఆయన తెగేసిచెప్పారు. దీంతో కేసు మైడ్స్టోన్ కౌంటీ కోర్టుకు ఎక్కింది. అక్కడ విల్సన్‌కు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. 'ఈయన విధానాలు న్యాయవిరుద్ధంగా ఉన్నాయి. ఇలాంటి వాటికి మన సమాజంలో చోటులేదు'అని న్యాయమూర్తి రిచర్డ్ పాల్డెన్ తేల్చిచెప్పారు. కోర్టు తీర్పును వ్యతిరేకించి వివక్ష చూపాలని చూస్తే.. కటకటాలు లెక్కపెట్టాల్సిందేనని స్పష్టంచేశారు.
'కూరల వాసన వచ్చే ఇల్లు మాకు వద్దంటూ కొందరు తెగేసి చెబుతున్నారు. దీంతో ఇళ్లను బాగుచేయించేందుకు పెద్దమొత్తంలో డబ్బు ఖర్చుబెట్టాల్సి వస్తోంది. అందుకే భారతీయులు, పాకిస్థానీలకు ఇళ్లు అద్దెకి ఇవ్వనని చెప్పాను'అంటూ తన వాదనను విల్సన్ సమర్థించుకున్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







