సౌదీ అరేబియా పౌరులు లెబనాన్ ను విడిచి వెంటనే తిరిగి వచ్చేయాలి

- November 09, 2017 , by Maagulf
సౌదీ అరేబియా పౌరులు లెబనాన్ ను విడిచి  వెంటనే తిరిగి వచ్చేయాలి


సౌదీ అరేబియా : లెబనాన్ ను విడిచిపెట్టి  "సాధ్యమైనంత త్వరలో సౌదీ అరేబియా పౌరులు స్వదేశానికి వచ్చేయాలని గురువారం సౌదీ అరేబియా కోరింది. సౌదీ మంత్రిత్వశాఖలో అధికారిక ప్రతినిధి సౌదీ ప్రెస్ ఏజెన్సీతో మాట్లాడుతూ, సౌదీ ప్రజలు ఎవరూ లెబనాన్ కు  ప్రయాణించవద్దని పిలుపునిచ్చింది. "లెబనాన్ రిపబ్లిక్ లో అనూహ్యంగా మారిన పరిస్థితి కారణంగా, ఆ దేశాన్ని సందర్శించేవారు  లేదా లెబనాన్ లో  నివసిస్తున్న సౌదీ అరేబియా పౌరులు వీలైనంత త్వరగా స్వదేశం బయలుదేరాలని కోరుతుంది. అదేవిధంగా తమ పౌరులు లెబనాన్ తో సహా  ఏ ఇతర అంతర్జాతీయ గమ్యస్థానాలకు ప్రయాణించకూడదని ఆ అధికారి తెలిపారు. ఆ తరువాత కువైట్ విదేశాంగ మంత్రిత్వశాఖ కువైట్ న్యూస్ ఏజెన్సీ ద్వారా ఒక ప్రకటనలో తెలియచేస్తూ తన పౌరులు తక్షణమే లెబనాన్ ను విడిచి వెంటనే తిరిగివచ్చేయాలని ఆదేశించింది. సౌదీ మరియు కువైట్ గత ఆరు రోజులుగా తీవ్ర రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్నాయి. ప్రధాన మంత్రి సద్ అల్ హరిరి శనివారం రియాద్ నుండి తన రాజీనామాను ప్రకటించారు.ఇరాన్ అల్-హరిరి పై ఆరోపిస్తూ లెబనీస్  హిజ్బుల్లాహ్, "లెబనీస్ రాజ్యాన్ని నియంత్రించటానికి" చర్యలు తీసుకొంటున్నట్లు ఆరోపించాడు మరియు తన జీవితాన్ని అంతం చేయాలనే లక్ష్యంగా పెట్టుకోవటానికి రహస్యంగా పన్నాగం చేస్తున్నాడని గ్రహించాడు. ఈ నేపథ్యంలో బెహ్రెయిన్ సైతం తన దేశ పౌరులను లెబనాన్ లో భద్రత లేదని వారు తక్షణమే ఆ దేశం విదిచి బెహ్రెయిన్ కు తిరిగివచ్చేయాలని  సలహా ఇస్తారు.సౌదీ విదేశాంగ మంత్రి అడిల్ అల్-జుబీర్ గురువారం హిజ్బుల్లాహ్ తీరుని విమర్శించారు  "వ్యవస్థను అపహరించదమే " కాక  "ఆల్-హరిరి ముందు రహదారి నిరోధకాలు " ఏర్పాటుచేసి ప్రతి అవకాశానికి ఉపయోగించుకొంటుందని  ఆయన ఆరోపించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com