హైదరాబాద్‌లో కలకలం సృష్టించిన కాల్పులు

- November 11, 2017 , by Maagulf
హైదరాబాద్‌లో కలకలం సృష్టించిన కాల్పులు

హైదరాబాద్‌ నగరంలోని మైలార్‌దేవ్‌పల్లిలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. స్థానిక పీస్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై జుబేద్‌ అనే వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల జుబేద్‌ ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. ఐటీ అధికారులకు ముస్తఫా సమాచారం ఇచ్చి ఉంటాడన్న అనుమానంతో జుబేద్‌ కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు చెప్పారు. తీవ్రంగా గాయపడ్డ ముస్తఫా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితునికి గతంలో నేర చరిత్ర ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com