ట్రాఫిక్ ఉల్లంఘనలు నాటకీయ తగ్గుదల

- November 12, 2017 , by Maagulf
ట్రాఫిక్ ఉల్లంఘనలు నాటకీయ తగ్గుదల

కువైట్  : ' దెబ్బకు ..దెయ్యం వదిలిందని '  మన తెలుగు సామెత..అదేవిధంగా కొత్త ట్రాఫిక్ నిబంధనలతో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నవారు ఒక్కసారిగా  బుద్ధిమంతులైపోయారు.దీంతో సగటున ట్రాఫిక్ ఉల్లంఘనల  సంఖ్య 4,000 నుండి రోజుకు 150 కు నాటకీయ స్థాయిలో తగ్గిపోయాయి. అంతర్గత వ్యవహారాల శాఖ యొక్క జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపిన వివరాల ప్రకారం  రెండు వారాల క్రితం నూతన ట్రాఫిక్  నిబంధనలు క్రితం ప్రారంభమైంది.  డ్రైవింగ్ లేదా ప్యాసింజర్ సీట్ బెల్ట్  పెట్టుకోకపోయిన , లేదా ఒకవేళ మోటారు సైకిల్ నడిపేవ్యక్తి  హెల్మెట్ ధరించకుండా డ్రైవింగ్ చేసినా...మొబైల్ ఫోన్ లో మాట్లాడుతూ ప్రయాణిస్తున్నా భారీ జరిమానాలు వీరికై సిద్ధంగా ఉన్నాయి. ఈ నూతన చర్యలు వాహనదారులు జాగ్రత్తగా ఉండేలా అప్రమత్తం చేశాయి. దీంతో వాహనదారుల ఉల్లంఘనల సంఖ్య క్రమేపి తగ్గిపోయాయి. ట్రాఫిక్ వ్యవహారాల సహాయ కార్యకర్త మేజర్ జనరల్ ఫహాద్ అల్-షుయేయ్ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com