భారత రాయబార కార్యాలయంలో ఐక్యవేదిక సభ్యులు
- November 12, 2017
కువైట్: తెలుగు సంఘాల ఐక్యవేదిక సభ్యులు కువైట్‌లో భారత రాయబారిని బుధవారం కలిశారు. వేదిక కన్వీనరు కుదరవల్లి సుధాకర్‌రావు ఆధ్వర్యంలో కువైట్‌లో ఉంటున్న 40 మంది తెలుగు సంఘాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు భారత రాయబారి కార్యాలయంలోని అధికారులను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా కార్యాలయ డీసీఎం రాజగోపాల్ సింగ్‌కు కన్వీనరు సుధాకర్‌రావు సభ్యులను పరిచయం చేశారు. కువైట్‌లో తెలుగు సంఘాలు చేస్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి డీసీఎంకు సభ్యులు వివరించారు. తెలుగు లలిత కళా సమితి అధ్యక్షుడు కొత్తపల్లి మోహన్‌బాబు ఐక్యవేదిక భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను అధికారులకు వివరించారు. రాయలసీమ గల్ఫ్ అసోసియేషన్ అధ్యక్షుడు గంగాధర్ కువైట్‌లో తెలుగువారు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రవాసాంధ్ర అధ్యక్షుడు మాలేపాటి సురేష్‌బాబు, మన కడప సేవాసమితి అధ్యక్షుడు సుబ్బు, అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు ప్రభాకర్ తదితరులు అధికారులను కలిసిన వారిలో ఉన్నారు. వీరంతా కలిసి డీసీఎం ప్రభాకర్‌ను సత్కరించారు. కువైట్‌లో తెలుగువారు ఎవరైనా కష్టాల్లో ఉంటే వెంటనే వారిని ఆదుకునేందుకు కార్యాచరణ రూపొందించినట్టు తెలుగు సంఘాల ఐక్యవేదిక తీర్మానించినట్లు కన్వీనరు కుదరవల్లి సుధాకర్‌రావు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







