రెహ్మాన్ కన్సర్ట్ కి హాజరవనున్న మోడీ, ట్రంప్ కుమార్తె

- November 12, 2017 , by Maagulf
రెహ్మాన్ కన్సర్ట్ కి హాజరవనున్న మోడీ, ట్రంప్ కుమార్తె

హైదరాబాద్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ త్వరలో హైదరాబాద్‌ రాబోతున్నారు. నవంబర్‌ 28న హెచ్‌ఐసీసీ(హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌)లో జరగనున్న జీఈఎస్‌(గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ సమ్మిట్‌) సమావేశంలో భాగంగా ఆమె తొలిసారి భారత్‌ విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ నగరం ముస్తాబవుతోంది.
 
అయితే 26న గచ్చిబౌలి స్టేడియంలో జరగబోయే ఏ.ఆర్‌ రెహమాన్‌ కచేరీ కార్యక్రమానికి ఇవాంక హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా వెళ్లనున్నారట. హైదరాబాద్‌లోని రహేజా మైండ్‌ స్పేస్‌లోని హోటల్‌లో ఇవాంక బస చేయనున్నారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఆమె కోసం డిన్నర్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
భారత్‌ పర్యటనలో భాగంగా ఇవాంక..

చార్మినార్‌, చౌమహల్లా ప్యాలెస్‌ తదితర పర్యటక ప్రాంతాలను వీక్షించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com