ఢిల్లీకి భారీగా అక్రమ రవాణాలు
- November 12, 2017
దిల్లీ: మిక్సీలు, గ్రైండర్లు, చెప్పులు, హ్యాండ్‌స్టిక్స్, లోదుస్తులు.. కాదేదీ స్మగ్లింగ్‌కు అనర్హం అన్నట్లుగా బంగారాన్ని వాటిల్లో దాచిపెట్టి అక్రమంగా దేశంలోకి తీసుకొస్తున్నారు కొందరు వ్యక్తులు. అయితే అలాంటి వారిని కస్టమ్స్ అధికారులు చాకచక్యంగా పట్టుకుంటున్నారు కూడా. అలా ఈ ఏడాది దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రమంలో ఇప్పటివరకూ 110కేజీల పసిడిని స్వాధీనం చేసుకున్నట్లు ఓ సీనియర్ కస్టమ్స్ అధికారి వెల్లడించారు.
ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు దిల్లీ ఎయిర్‌పోర్టులో అక్రమంగా తరలిస్తున్న 110 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సదరు అధికారులు తెలిపారు. దీని విలువ దాదాపు రూ.37కోట్లు ఉంటుంది. మొత్తం 114 స్మగ్లింగ్ కేసులు నమోదవగా.. 62 మంది స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు చెప్పారు. కాగా.. గతేడాదితో పోలిస్తే స్మగ్లింగ్ తగ్గిందని.. నోట్ల రద్దే అందుకు కారణమని వెల్లడించారు.
2016లో దిల్లీలో మొత్తం 110 స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయి. 79 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.48కోట్ల విలువైన 188 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!