సిరియాలో రష్యా వైమానిక దాడులు
- November 12, 2017
సిరియా: ఐఎస్ ఉగ్రవాదులే లక్ష్యంగా సిరియాలో జరుగుతున్న వైమానిక దాడులతో అమాయకులు మృత్యువాత పడుతూనే ఉన్నారు. శనివారం రష్యా వైమానిక దళం తూర్పు సిరియాలో జరిపిన దాడుల్లో 9 మంది చిన్నారులతో పాటు 26 మంది పౌరులు మృతి చెందినట్లు మానవహక్కుల సంఘాలు ప్రకటించాయి. అల్బూ కమాల్ పట్టణ పరిసర ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో వీరంతా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఐఎస్ ఉగ్రవాదుల చెర నుంచి వివిధ ప్రాంతాలను విముక్తి చేస్తూ వస్తున్న సైన్యం.. రెండు రోజుల క్రితం అల్బూకమాల్పై దాడులు ప్రారంభించింది. ఉగ్రవాదులు ప్రతిఘటించగా రష్యా సైన్యం వైమానిక దాడులు చేపట్టింది. అల్సుఖారియా ప్రాంతంలో ఓ పునరావాస కేంద్రంపై బాంబులు పడగా ఏడుగురు చిన్నారులు సహా 15 మంది చనిపోయారని, అల్బూ కమాల్కు 50 కిలోమీటర్ల దూరంలోని ఓ గ్రామంలో ఇద్దరు చిన్నారులతో పాటు మరో 11 మంది మృత్యువాత పడ్డారని మానవహక్కుల సంఘాలు తెలిపాయి. 2011 నుంచి సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధంలో దాదాపు 30.30లక్షల మంది కన్నుమూసినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!