ప్రతిపక్షం లేకుండా కూల్ కూల్‌గా ఏపీ అసెంబ్లీ సమావేశాలు
- November 12, 2017
శని ఆదివారం సెలవుల తర్వాత అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజుకొనసాగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. విజయవాడ కృష్ణా నదిలో జరిగిన పడవ ప్రమాదంలో మరణించిన వారికి సభ్యులు సంతాపం తెలపనున్నారు. అనంతరం అసెంబ్లీలో నాలుగు బిల్లులు ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
నీటి పారుదల వ్యవస్థలను రైతులు నిర్వహించే చట్టానికి ప్రతిపాదించిన సవరణ బిల్లును సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రవేశపెడతారు. ఇటు ఆంధ్రప్రదేశ్ వడ్డీ వ్యాపారుల చట్టానికి సవరణ బిల్లును హోం మంత్రి చిన రాజప్ప సభలో పెడతారు. ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ చట్టానికి సవరణ బిల్లును ఆ శాఖ మంత్రి లోకేశ్, నాలా పన్నుకు సంబంధించి సవరణ బిల్లును రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రవేశపెడతారు.
అసెంబ్లీలో నివేదికలు కూడా ప్రవేశ పెట్టనున్నారు. విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు సంబంధించిన నివేదికను ఆ శాఖ మంత్రి కిమిడి కళా వెంకట్రావు, రాష్ట్ర వ్యవసాయాభివృద్ధి కమిషన్‌కు సంబంధించిన వార్షిక నివేదికను ఆ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సభలో ప్రవేశపెడతారు. ప్రతిపక్ష వైసీపీ సభ్యులెవరూ సభకు హాజరు కాకపోవడంతో సమావేశాలు ప్రశాంతంగా కొనసాగనున్నాయి.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!