హైదరాబాద్ నగరంలో విదేశీ యువతులతో ఆన్‌లైన్ సెక్స్ రాకెట్: యువతులు, విటుల అరెస్ట్

- November 13, 2017 , by Maagulf
హైదరాబాద్ నగరంలో విదేశీ యువతులతో ఆన్‌లైన్ సెక్స్ రాకెట్: యువతులు, విటుల అరెస్ట్

నగరంలో గుట్టుచప్పడుకుండా నడుపుతున్న మరో ఆన్‌లైన్ సెక్స్ రాకెట్‌ను ఛేదించారు ఎస్ఓటీ పోలీసులు. ఆన్‌లైన్‌లో ఫోన్‌ నంబర్లు పెడుతూ విదేశాల నుంచి యువతులను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.
ఆకర్షిస్తూ.. 
ఫోన్ నెంబర్లతో..
పోలీసులు తెలిపిన ప్రకారం.. సికింద్రాబాద్‌కు చెందిన తాళ్ల వినోద్‌కుమార్‌(30), ఉప్పల్‌కు చెందిన అభిలాష్‌(30) ఆన్‌లైన్‌లో ఫోన్‌ నంబర్లు పెడుతూ విటులను ఆకర్షిస్తున్నారు.

గుట్టుచప్పుడు కాకుండా.. 
విదేశీయువతులతోనూ..
దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారే కాకుండా విదేశాలకు చెందిన యువతులను రప్పించి వ్యభిచారం కార్యకలాపాలను గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు.

నాలుగేళ్లుగా.. 
యువతులను ఒకచోట ఉంచి..
యువతులను ఒక చోట ఉంచి విటులకు వీరి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అందిస్తున్నారు. సుమారు గత మూడు, నాలుగేళ్లుగా ఈ దందాను సాగిస్తుండటం గమనార్హం.

పరారీలో మరో నిందితుడు 
నిర్వాహకుడి అరెస్ట్
ఆదివారం ఉప్పల్‌లోని క్రికెట్‌ స్టేడియం ప్రాంతంలో మల్కాజ్‌గిరి ఎస్‌ఓటీ విభాగం ఓఎస్‌డీ రఫిక్‌, ఎస్సై మహేష్‌ సూచనల మేరకు జోన్‌ ఓస్‌ఓటీ పోలీసులు పశ్చిమబెంగాల్‌కు చెందిన యువతి(24)తో పాటు నిర్వాహకుడు తాళ్ల వినోద్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న అభిలాష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com