తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 12వ రోజుకు చేరుకున్నాయి
- November 13, 2017
ప్రశ్నోత్తరాల అనంతరం రైతు సమన్వయసమితులు, సాగుకు 8వేల ఆర్ధిక సాయంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. శుక్రవారమే దీనిపై చర్చ ప్రారంభమైంది. టీఆర్ఎస్ సభ్యుడు శేఖర్ రెడ్డి మాట్లాడారు. అయితే కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేయడంతో అంశంపై చర్చను డిప్యూటీ స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు. రైతు సమన్వయ సమితీలు టీఆర్ఎస్ కమిటీలుగా ఉన్నాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్..అసెంబ్లీలో అధికారపార్టీని నిలదీసేందుకు సిద్ధమవుతోంది. దీంతో ఇవాళ సభ హాట్ హాట్ గా సాగే అవకాశం ఉంది.
ఇక రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న కొత్త గ్రామ పంచాయతీలపై పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయాలని భావిస్తున్నారు కేసీఆర్. ఇప్పటికే కొత్త పంచాయతీలపై ప్రజా ప్రతినిధుల ప్రతిపాదనలు కొరింది ప్రభుత్వం. దీనిపై 5 వేలకు పైగా దరఖాస్తులు అందాయి. నాలుగు కేటగిరీలుగా పంచాయతీలను విభజించాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది. దీనిపై టీఆర్ఎస్పీలో చర్చించాలని గులాాబీ బాస్ నిర్ణయించారు. సమావేశానికి సంబంధించి పార్టీ నేతలకు సమాచారం వెళ్లింది. అసెంబ్లీ త్వరగా ముగిస్తే ఇవాళే సమావేశం జరిగే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!