యూఏఈ వెదర్: రెసిడెంట్స్‌కి హెచ్చరిక
- November 13, 2017
దుబాయ్, అలాగే ఎమిరేట్స్‌లోని ఇతర ప్రాంతాల్లో బలమైన గాలులల కారణంగా దుమ్ము, ధూళి విపరీతంగా ఎగసిపడుతున్నాయి. పగటి పూట కొన్ని చోట్ల మేఘావృతమై ఉంటుందని, బలమైన గాలులు ఎప్పటికప్పుడు వీచే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ అండ్ సెస్మాలజీ హెచ్చరికలు జారీ చేసింది. సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళేవారు, అక్కడి 'రఫ్ వెదర్'తో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. మెబ్రె మౌంటెయిన్ ప్రాంతంలో 12 గంటల సమయానికి 10.3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యింది. రాత్రి వేళల్లో హ్యుమిడిటీ ఎక్కువగా ఉండనుంది. కోస్టల్ ఏరియాస్‌లో 70 నుంచి 85 శాతం, మిగతా ప్రాంతాల్లో 70 నుంచి 90 శాతం వరకు హ్యుమిడిటీ ఉండే అవకాశాలున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు 31 నుంచి 35 వరకు ఉండొచ్చు.
తాజా వార్తలు
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్







