ట్రంప్ కుమార్తె ఇవాంకా భద్రతపై వైట్‌హౌస్ వర్సెస్ ఎస్‌పీజీ
- November 13, 2017
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ భద్రత విషయంలో వైట్ హౌస్ సెక్యూరిటీ విభాగాలు.. కేంద్ర హోంశాఖతోపాటు ఎస్‌పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్)కు స్పష్టమైన సూచనలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్‌లో ఆమె పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెచ్‌ఐసీసీలో జరిగే ప్రపంచ పారిశ్రామిక సదస్సులోకి పోలీస్ అధికారులు, సిబ్బంది ఆయుధాలతో ప్రవేశించేందుకు వీల్లేదని అమెరికా సెక్యూరిటీ వింగ్ స్పష్టం చేసినట్టు తెలిసింది.
అయితే ఇవాంక ట్రంప్ భద్రతతో పాటు దేశ ప్రధాని మోదీ భద్రత కూడా ముఖ్యమని, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భద్రతలో ఉన్న ప్రధాని వెనుక ఆర్మ్‌డ్ సిబ్బంది ఉండాలని కేంద్ర హోంశాఖతో పాటు ఎస్‌పీజీ పట్టుబడుతోంది. అయితే గతంలో టర్కీలో జరిగిన హైకమిషనర్ కాల్పుల వ్యవహారంతో అమెరికన్ సెక్యూరిటీ సదస్సులోకి ఎవరూ ఆయుధాలు తేవద్దన్న నిబంధనను పెడుతున్నట్టు కేంద్ర హోంశాఖ భావిస్తోంది. ఇవాంకా ట్రంప్ భద్రతకు సంబంధించి అమెరికన్ సెక్యూరిటీయే ప్రత్యేకంగా వాహనాలు, సిబ్బందిని రంగంలోకి దించనున్నట్టు తెలుస్తోంది.
అదేవిధంగా సదస్సు బయటే ఎస్‌పీజీ, కేంద్ర రాష్ట్ర పోలీస్ బలగాలు భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని అమెరికన్ వైట్‌హౌస్ కేంద్ర హోంశాఖకు స్పష్టం చేసినట్టు రాష్ట్ర పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో కేంద్ర హోంశాఖ, ఇంటెలిజెన్స్ బ్యూరో, స్పెçషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అధికారులు త్వరలోనే రాష్ట్రంలో పర్యటించి భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







