అగ్ని ప్రమాదం: మంటల్ని అదుపు చేసిన ఫైర్ ఫైటర్స్
- November 16, 2017షార్జా: షార్జా సివిల్ డిఫెన్స్ ఫైర్ ఫైటర్స్ చాకచక్యంగా వ్యవహరించి, భారీ అగ్ని ప్రమాదాన్ని అదుపులోకి తెచ్చారు. ఇండస్ట్రియల్ ఏరియూలో గురువారం మధ్యాహ్నం పలు వేర్ హౌస్‌లలో ఈ అగ్నికీలలు వ్యాపించాయి. జనరల్ ట్రేడింగ్‌కి సంబంధించిన ఇండస్ట్రియల్ ఏరియా 6 లోని వేర్ హౌస్‌లు ఈ అగ్ని ప్రమాదం కారణంగా తగలబడ్డాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని సివిల్ డిఫెన్స్ పేర్కొంది. మధ్యాహ్నం 12.55 నిమిషాల సమయంలో సమాచారం తమకు అందిందనీ, వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశామని షార్జా సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ కల్నల్ సమి ఖామిస్ అల్ నక్బి చెప్పారు. మంటల్ని ఇతర వేర్ హౌస్‌లకు వ్యాపించకుండా చేయడం, అలాగే మంటల్ని పూర్తిగా అదుపు చేయడంలో ఫైర్ ఫైటర్స్ సక్సెస్ అయ్యారని ఆయన వివరించారు. కూలింగ్ ఆపరేషన్స్ చేపట్టి, పూర్తిస్థాయిలో ఆ ప్రాంతం సేఫ్ అని ఫైర్ ఫైటర్స్ నిర్ధారించిన అనంతరం, అక్కడ ఘటన ఎలా జరిగిందన్నదానిపై నిపుణుల బృందం తనిఖీలు నిర్వహిస్తుంది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్