ఉదయాన్నే సూర్యకిరణాలు శరీరాన్నితాకితే...
- November 16, 2017చాలామంది ఉదయాన్నే నిద్రలేవడం ఎంతో కష్టంగా భావిస్తుంటారు. రాత్రిసమయంలో ఎంత ఆలస్యంగానైనా పడుకుంటారు కానీ, ఉదయాన్నే నిద్రలేవడం మాత్రం ససేమిరా అంటారు. మరి అలాంటప్పుడు ఉత్సాహవంతమైన ఉదయానికి స్వాగతం పలకడానికి ఏం చేయాలి.
నిజానికి సూర్యోదయం కంటే ముందు నిద్రలేవడం వల్ల ఆ రోజంతా ఎంతో హుషారుగా ఉంటారు. కానీ, అలా నిద్రలేవడమే చాలా కష్టంగా భావిస్తుంటారు. నిద్ర నుండి బయటపడలేక, ఆ బద్దకాన్ని వదల్లేక ఇబ్బందులు పడుతుంటారు.
అలాగే, ఉదయాన్నే సూర్యకిరణాలు శరీరంపై పడటం వల్ల నిద్ర మత్తు వదిలిపోతుంది. పైగా, శరీరం నూతనోత్సాహాన్ని పొందుతుంది. అంతేకాదు శరీరానికి సహజసిద్ధమైన శక్తి అందుతుంది.
నిద్రలేవగానే కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత జాగింగ్, వాకింగ్లాంటివి చేయడం వల్ల శరీరం ఉత్సాహంగా ఉంటుంది. నిద్రలేవగానే గ్లాసు మంచినీళ్ళు తాగాలి. దీనివల్ల డీహైడ్రేషన్ కాకుండా శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది.
రాత్రిపూట టీవీ ఎక్కువసేపు చూడటం వల్ల రాత్రంతా నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. పడుకునేముందు టీవీ చూడటం వల్ల ఆ వెలుతురు కళ్ళపై ప్రభావం చూపుతుంది.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం