భారీ నష్టాన్నే మిగిల్చిన భూకంపం
- November 17, 2017
ఇరాన్-ఇరాక్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన భూకంపం భారీ నష్టాన్నే మిగిల్చింది. ఆదివారం రాత్రి ఇరాన్-ఇరాక్ సరిహద్దులో 7.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. భూకంపం ధాటికి దాదాపు 500 వందల మంది ప్రాణాలు కోల్పోగా.. 10వేల మంది వరకు గాయపడ్డారు. లక్షలాది మంది తమ ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. కెర్మాన్షాహ్ ప్రావిన్స్‌లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం నాటి భూకంపం కారణంగా ఇరాన్-ఇరాక్ సరిహద్దు శవాల గుట్టగా మారిపోయింది. భవన శిథిలాలే.. శవపేటికలుగా మారాయి. ఎక్కడికక్కడ భవనాలు కుప్పకూలిపోయి రహదారులన్నీ శిథిలాలను తలపిస్తున్నాయి. నిరాశ్రయులైన వారికి అక్కడి ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది. ఈ భూకంపం వల్ల కలిగిన నష్టం సుమారు 5 బిలియన్ యూరోలు అంటే భారత కరెన్సీలో రూ.3లక్షల కోట్లు అన్న మాట.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!