వేదనిలయంలో ఐటీ సోదాలు, పలు కీలక ఆధారాలు స్వాధీనం
- November 18, 2017
జయలలిత నివాసమైన వేదనిలయంపై ఆదాయపు పన్ను శాఖ కన్నేసింది. ఇక్కడ అధికారులు సోదాలు చేపట్టడంతో పోయెస్‌గార్డెన్ భద్రతావలయంలో ఉంది. దిల్లీ నుంచి వచ్చిన సీనియర్ ఐటీ అధికారులు కూడా తనిఖీల్లో పాల్గొన్నారు. కీలక పత్రాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో స్థానిక అధికారులు అంత చొరవగా పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో ఇటు పోయెస్గార్డెన్తోపాటు అటు నుంగంబాక్కంలోని ఆదాయపు పన్నుశాఖ కార్యాలయం వద్ద కూడా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి వేదనిలయంలో మొదలైన సోదాలు కలకలం రేపాయి. ఈ సందర్భంగా అక్కడికి జయ టీవీ సీఈవో వివేక్‌తోపాటు శశికళ, దినకరన్‌ల మద్దతుదారులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. పోలీసులతో కొందరు వాగ్వివాదానికి కూడా దిగారు. ఆత్మాహత్యాయత్నం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. పోయెస్‌గార్డెన్‌కు వెళ్లే అన్ని మార్గాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఈ పరిణామాలపై శశికళ వర్గం మండిపడింది. దీనిపై టీటీవీ దినకరన్ మాట్లాడుతూ...తమను రాజకీయాలన నుంచి దూరం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయన్నారు. ఇందులో కుట్ర ఉందని ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీలపై కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. వారే తమ నాశనాన్ని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కేంద్రం కవ్వింపులకు తాము భయపడేది లేదని స్పష్టం చేశారు. తాము ఎక్కడికి పోమని, ఇక్కడే ఉంటామని... చేతనైంది చేసుకోండని సవాలు విసిరారు.
అన్నాడీఎంకే మిత్రపక్షమని పేర్కొనే భాజపా నాయకులు గతంలో జయలలితను చూడడానికి రాలేదని, అలాంటిది కరుణానిధిని పరామర్శించడానికి మాత్రం మోదీ వచ్చారని విమర్శించారు. అమ్మ జయలలిత గౌరవాన్ని ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి కేంద్రం వద్ద తాకట్టు పెట్టడం వల్లనే ఐటీ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. అనంతరం ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి వేరే కార్యక్రమంలో మాట్లాడుతూ... ఆదాయపు పన్ను శాఖ దాడులు ఎందుకు జరుగుతాయో అందరికీ తెలుసన్నారు. కొందరు తమకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని, పోయెస్‌గార్డెన్‌లోని వేద నిలయంలో దాడులకు తాము కారణం అనడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ఎలాంటి పాత్ర పోషించడం లేదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!