కార్నిష్ ను వదులుకోవద్దు
- November 12, 2015
బహ్రైన్ లోని ప్రఖ్యాత అల్ ఫతే కోర్నిచే ను పెట్టుబడుల నిర్వహణ కోసం బహరేన్ ముమ్తలకత్ కంపెనీ వారికి అప్పగించవద్దని, పార్లమెంటు సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. పార్లమెంటు యొక్క ప్రజావసరాలు మరియు పర్యావరణ వ్యవహారాల కమిటీ చైర్మన్ ఆడెల్ అల్ అసూమి, ఈ భూమిని పనులు, మునిసిపాలిటీలు మరియు పట్టణ ప్రణాళికా వ్యవహారాల శాఖ వారి అధీనoలోనే ఉంచాలని కోరుతూ ఒక అత్యవసర ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించారు. ప్రభుత్వం వద్ద అల్ ఫతే కోర్నిచే మరియు పాత సిట్రా బ్రిడ్జ్ అనే రెండు బహిరంగ తీరప్రాంత ప్రదేశాలు ఉన్నాయని, వాటిలో పాత సిట్రా బ్రిడ్జ్ కుటుంబ విహార ప్రాంతంగా ఉందని; కోర్నిచే గనుక ఆ కంపెనీ వారి చేతులోకి వెళ్ళినట్లయితే, ఇక ప్రజలు దాని ముఖం కూడా చూడలేరని ఆయన వివరించారు. సమాచారం, పార్లమెంటు మరియు షూరా వ్యవహారాల శాఖా మంత్రి ఇసా అల్ హమ్మాదీ, మరింత సమాచారాన్ని సేకరించడం కోసం ఈ కార్యక్రమాన్ని మరో వారం రోజులపాటు వాయిదా వేయవలసినదిగా విజ్ఞప్తి చేసారు.
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









