యాభై ఏళ్ళ నాటి సౌదీ అరామ్కో జెడ్డా రిఫైనరీ నిరవధికంగా మూసివేత

- November 19, 2017 , by Maagulf
యాభై ఏళ్ళ నాటి సౌదీ అరామ్కో జెడ్డా రిఫైనరీ నిరవధికంగా మూసివేత

జెడ్డా : పురాతన చమురు శుద్ధి కర్మాగారం మూతపడింది. పర్యావరణ సమస్య ఉండటంతో జెట్డాలో రోజుకు 90,000 బ్యారెల్ ముడి చమురు శుద్ధి చేసే సౌదీ అరామ్కో జెడ్డా రిఫైనరీ కర్మాగారాన్ని నిరవధికంగా మూసివేశారు. జెడ్డాకు  చెందిన పారిశ్రామిక వర్గాల సమాచారం మేరకు ఈ సంగతి వెలుగులోనికి వచ్చింది. ఆ కర్మాగారం కాలం చెల్లడం మరియు పర్యావరణv ఆందోళనల కారణంగా రిఫైనరీని మూసివేయడానికి తగిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 1967 లో ఆరంభమైన ఈ చమురుశుద్ధి కర్మాగారం  దేశం యొక్క పశ్చిమ ప్రాంతంలో ఎక్కువ భాగం  తన విలువైన సేవలను అందించింది. ఈ మూసివేత కారణంగా  ఇతర సౌదీ చమురుశుద్ధి కర్మాగారాల వద్ద డిమాండ్ పెరుగుతుంది. సౌదీ అరామ్కో జెడ్డా రిఫైనరీ ద్రవీకృత పెట్రోలియం వాయువు, గ్యాసోలిన్, డీజిల్, తారు మరియు జెట్ ఇంధనం మరియు నఫ్తాలను సమర్ధవంతంగా ఎగుమతి చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com