దొండకాయ వల్ల ఉపయోగాలు.!
- November 19, 2017వేపుడు, కూరల ద్వారా దొండకాయను డైట్లో చేర్చుకుంటూ వుంటాం. అలాంటి దొండకాయలో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. దొండలో విటమిన్లు, ఖనిజాలు, పీచు పుష్కలంగా వుంటాయి. దొండకాయలను ఆహారంలో చేర్చుకుంటే బరువు తగ్గుతారు. జలుబు, దగ్గు దరిచేరవు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాల ద్వారా ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి.
దొండలోని బి-విటమిన్ నాడీవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. ఆందోళన, మూర్ఛ వ్యాధులతో బాధపడేవాళ్లకి దొండకాయ మంచి ఔషధంగా పనిచేస్తుంది. అల్జీమర్స్నీ అడ్డుకుంటుంది. ఇందులోని రిబోఫ్లేవిన్ ఎక్కువగా ఉండే దొండ మనసును ప్రశాంతంగా ఉంచి, డిప్రెషన్ తగ్గడానికి దోహదపడుతుంది.
దొండకాయలోని గుణాలు కాలేయం మీద నేరుగా పనిచేస్తాయి. ఫలితంగా శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపించేందుకూ రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించేందుకూ దోహదపడతాయి. మధుమేహం వచ్చే సూచనలు ఉన్నవాళ్లు దొండని ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలావరకూ రాకుండా నియంత్రిస్తుంది. దొండలోని కాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా రక్షిస్తుంది. అదేసమయంలో ఎముక సాంద్రత పెరిగేందుకూ తోడ్పడుతుంది.
తాజా వార్తలు
- భారత్కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..
- తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్