అమరావతిలో సందడిచేసిన దీపికా పదుకొనే, రానా
- November 19, 2017
విజయవాడలో తారలు తళుక్కు మన్నారు. సోషల్ మీడియా సమ్మిట్ అండ్ అవార్డ్స్ కార్యక్రమంలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే, టాలీవుడ్ స్టార్ దగ్గుబాటి రానా సందడి చేశారు. వారిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో సందడి నెలకొంది.
ఏపీ పర్యాటక శాఖ సోషల్ మీడియా సదస్సు, అవార్డుల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. మోస్ట్ పాపులర్ యాక్ట్రెస్ అవార్డ్‌ను దీపికా దీపికా పదుకొనే అందుకోగా.. మోస్ట్ యాక్టివ్ సౌత్ ఇండియన్ యాక్టర్ అవార్డును దగ్గుబాటి రానా అందుకున్నారు. బెస్ట్ మ్యూజిక్ సెన్సేషనల్ అవార్డ్ అనిరుధ్ కు దక్కింది. వీరికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ అవార్డులు ప్రదానం చేశారు.
అంతకు ముందు ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న దీపికాకు ప్రభుత్వ అధికారులు ఘన స్వాగతం పలికారు. తరువాత విజయవాడలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో దీపిక పాల్గొన్నారు. సెలబ్రిటీలను చూసేందుకు తరలివచ్చిన అభిమానులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







