సోషల్‌ క్యాంపెయిన్‌తో తగ్గుతున్న రోడ్డు ప్రమాదాలు

- November 19, 2017 , by Maagulf
సోషల్‌ క్యాంపెయిన్‌తో తగ్గుతున్న రోడ్డు ప్రమాదాలు

సోషల్‌ మీడియా ద్వారా రోడ్డు ప్రమాదాలపై జరుపుతున్న ప్రచారం కారణంగా, రోడ్డు ప్రమాదాల్లో గణనీయంగా తగ్గుదల నమోదయినట్లు ట్రాఫిక్‌ అథారిటీస్‌ వెల్లడిస్తున్నాయి. అబుదాబీలో గత రెండేళ్ళలో రోడ్డు ప్రమాదాలు 6.5 శాతం మేర తగ్గాయి. ఈ తగ్గుదలకు సంబంధించి సోషల్‌ మీడియా ప్రచారం కూడా ఎంతో కీలక పాత్ర పోషించినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. 'టుగెదర్‌' పేరుతో అబుదాబీ ట్రాఫిక్‌ అండ్‌ పెట్రోల్స్‌ డైరెక్టరేట్‌ ఆన్‌లైన్‌ క్యాంపెయిన్‌ కొన్నేళ్ళ క్రితం ప్రారంభించింది. భద్రత పట్ల సోషల్‌ మీడియాలో అవగాహన కల్పించడమే టుగెదర్‌ లక్ష్యం. స్మార్ట్‌ అప్లికేషన్ల ద్వారా, సోషల్‌ మీడియా సైట్స్‌ ద్వారా అవేర్‌నెస్‌ పెంచుతుతున్నారు రోడ్డు ప్రమాదాల పట్ల. యూ ట్యూబ్‌లో 150,000 మంది తాము పొందుపర్చిన షార్ట్‌ అవేర్‌నెస్‌ వీడియోస్‌ చూశారు. ట్విట్టర్‌లో 250,000 ట్వీట్స్‌ రోడ్డు ప్రమాదాల తగ్గింపుపై అవేర్‌నెస్‌ కల్పిస్తూ పోస్ట్‌ చేశారు. 250,000 కామెంట్స్‌ సోషల్‌ మీడియా ద్వారా వచ్చాయి. ప్రింట్‌ మీడియాలో 678 ప్రచార కథనాలు, 528 రేడియో మెసేజ్‌లు, టెలివిజన్‌ ఛానెల్స్‌లో 50 ప్రచార కార్యక్రమాల్ని పొందుపరిచారు. 2016లో స్పెషల్‌ డ్రైవ్‌ని ప్రారంభించి 18 నుంచి 30 ఏళ్ళ మధ్య వయసు వారే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టామని ట్రాఫిక్‌ అండ్‌ పెట్రోల్స్‌ డైరెక్టరేట్‌ స్టాఇస్టిక్స్‌ స్టడీస్‌ డిపార్ట్‌మెంట్‌ తరఫున లెఫ్టినెంట్‌ కల్నల్‌ అలి అల్‌ హర్బి చెప్పారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com