చైనా ఆర్మీ వినూత్న ప్రయోగం

- November 20, 2017 , by Maagulf
చైనా ఆర్మీ వినూత్న ప్రయోగం

బీజింగ్‌: చైనా ఆర్మీ వినూత్న ప్రయోగం చేపట్టింది. ఆన్‌లైన్‌లో సైనిక సమాచారం బహిర్గతం కాకుండా నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టిం ది. ఈమేరకు ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభిం చింది. సైనిక సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేసిన వారి వివరాలను సైతం ఇట్టే కనిపెట్టగల సాంకేతిక పరిజ్ఞానం తాము రూపొందించిన వెబ్‌సైట్‌లో ఉందని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రపంచలోనే అత్యంత శక్తివంతమైన సైన్యంగా చైనా సైన్యాన్ని నిలిపేందుకు ప్రయత్నిస్తున్నట్టు పీపుల్స్‌ ఆర్మీ పేర్కొన్నది. చైనా సైనిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...సైన్యానికి సంబంధించి తప్పుడు వార్తలు పోస్ట్‌ చేసిన వారి వివరాలను ఈసైట్‌ ద్వారా గుర్తించవచ్చునని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో చైనా ఆర్మీకి సంబంధించిన వివరాలను ఎవరైనా పోస్ట్‌ చేసినట్టయితే ఈవెబ్‌సైట్‌ ద్వారా కనిపెట్టేం దుకు వీలవుతుందని అధికారులు తెలిపారు. చైనా సైన్యాన్ని ఆధునీకరించే క్రమంలో భాగంగా విప్ల వాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టనున్నట్టు చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ నిర్వహించిన 19వ సదస్సులో దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌ వెల్లడించిన సంగతి తెలిసిం దే. సైబర్‌ దాడులను తిప్పిగొట్టగల సామర్ధ్యం, అధు నాత యంత్రాంగం తమ సైన్యంలో ఉందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com