గంటకు 204 కిలోమీటర్ల వేగం: గుర్తించిన రాడార్
- November 21, 2017
రస్ అల్ ఖైమా: రస్ అల్ ఖైమాలో ఓ రాడార్, గంటకు 204 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్న కారుని గుర్తించింది. సెంట్రల్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ డాక్టర్ మొహమ్మద్ సయీద్ అల్ హుమైది మాట్లాడుతూ, ఇటీవలి కాలంలో ఇదే అత్యంత వేగం అని చెప్పారు. షేక్ మొహమ్మద్ జాయెద్ రోడ్డుపై అత్యధిక వేగం గంటకు 120 కిలోమీటర్లు కాగా, దానికి చాలా ఎక్కువైన గంటకు 204 కిలోమీటర్ల దూరంతో కారు దూసుకుపోయినట్లు చెప్పారాయన. నిర్లక్ష్యంతో, అతి వేగంతో వాహనం నడిపిన ఆ వాహన యజమాశ్రీనికి నోటీసులు పంపారు. 3,000 దిర్హామ్‌ల జరీమానా, 23 బ్లాక్ పాయింట్స్ అలాగే 60 రోజులపాటు వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలు తీసుకోబడతాయి స్పీడ్ లిమిట్‌ని మించి గంటకు 80 కిలోమీటర్ల వేగం దాటితే. ఈ ఏడాది రస్ అల్ ఖైమాలో 1,514 మంది గంటకు 60 కిలోమీటర్ల మేర అదనపు వేగంతో దూసుకుపోయినవారిని గుర్తించి, కేసులు నమోదు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







