ఘాటుగానే చివాటు పెట్టిన మిస్ వరల్డ్
- November 21, 2017మన దేశానికి 17 ఏళ్ల తరువాత మిస్ వరల్డ్ టైటిల్ను మనుషి చిల్లర్ సాధించి పెట్టిన విషయం విదితమే. ఈ మధ్యే జరిగిన ఈ పోటీల్లో మనుషి చిల్లర్ ఈ ఘనత సాధించింది. దేశానికి 6వ మిస్ వరల్డ్ టైటిల్ తెచ్చి పెట్టింది. ఇందుకు గాను ఆమెను యావత్ దేశ ప్రజలు అభినందిస్తున్నారు. ఆమెపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అయితే కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ చేసిన తాజా వ్యాఖ్యలు దుమారం రేపాయి. అయితే తాను మనుషిని అవమానించాలని అలా అనలేదని, కేవలం నోట్ల రద్దుపై చలోక్తి విసిరానని చెప్పి, మనుషికి క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దు మణిగింది. ఇంతకీ అసలు శశి థరూర్ ఏమన్నారంటే..?
మనుషి చిల్లర్ మిస్ వరల్డ్ టైటిల్ గెలిచిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పోస్ట్ చేశాడు. నోట్ల రద్దు పెద్ద తప్పుడు నిర్ణయమని, బీజేపీకి ఇప్పుడు బాగా తెలిసివచ్చిందని, ఇండియన్ క్యాష్ ప్రపంచాన్ని డామినేట్ చేస్తుందని, మన చిల్లర్ మిస్ వరల్డ్ అయిందని.. అతను ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు. అందుకు మనుషి కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చింది. ఎవరో దారిన పోయే దానయ్య అనే మాటలను మిస్ వరల్డ్ టైటిల్ విన్నర్ పట్టించుకోదని, చిల్లర్ అనే పేరులోనే చిల్ ఉందని, ఆ విషయం మరిచిపోయిన చిల్లర టాక్ ఎందుకని ఆమె ట్వీట్ చేసింది.
Exactly @vineetjaintimes agree with you on this. A girl who has just won the World isn't going to be upset over a tongue-in-cheek remark. 'Chillar' talk is just small change - let's not forget the 'chill' within Chhillar @ShashiTharoor https://t.co/L5gqMf8hfi
- Manushi Chhillar (@ManushiChhillar) November 20, 2017
అయితే మళ్లీ థరూర్ ఏమనుకున్నాడో గానీ. తాను మనుషిని అవమానించాలని ఆ ట్వీట్ చేయలేదని, నోట్ల రద్దుతో పోలుస్తూ ఓ చలోక్తి విసిరానని, అది అవతలి వ్యక్తిని నొప్పిస్తుందని అనుకోలేదని చెబుతూ మనుషికి సారీ చెప్పాడు. దీంతో వివాదం ముగిసింది. అయినప్పటికీ మనుషి చిల్లర్ పట్ల పలువురు నెటిజన్లు విమర్శలను గుప్పిస్తున్నారు. అయినప్పటికీ వాటిని మనుషి పట్టించుకోవడం లేదు. అవును మరి, చిల్లర విమర్శలకు చిల్లర్ స్పందించాల్సిన పనిలేదు. దారిన ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటయ్. వాటిని పట్టించుకోవాల్సిన పనిలేదు కదా..!
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!