సౌదీ అరేబియాలో భారీ వర్షం కురవడంతో జెడ్డాను చుట్టుముట్టిన వరదలు

- November 21, 2017 , by Maagulf
సౌదీ అరేబియాలో భారీ వర్షం కురవడంతో జెడ్డాను చుట్టుముట్టిన వరదలు

సౌదీ అరేబియా:మంగళవారం కురిసిన భారీ వర్షం కారణంగా జెడ్డా నగరం తడిచి ముద్దయి వరదలు చుట్టుముట్టేయి. సౌదీ నగరంలోని పలు వీధుల్లో నీళ్ళు పెద్ద ఎత్తున ప్రవహించడంతో పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయి. దీంతో కొందరు నివాసితులు మారిన వాతావరణ పరిస్థితులను వీడియోలు మరియు ఫోటోలుగా తీసి ఇతరులతో పంచుకోవడానికి ట్విటర్ లో పోస్టులు పెట్టారు. రహదారులపై నీటి మట్టం క్రమేపి పెరగడంతో ఆయా మార్గాలలో ప్రయాణిస్తున్న పలు వాహనాలు వరద నీట  మునిగిపోయాయి. భారీ వర్షం కారణంగా వెల్లువెత్తిన వరదలతో పట్టణ ప్రాంతాల్లో రోడ్లను చుట్టుముట్టడంతో మక్కా ప్రాంత గవర్నర్ మరియు సౌదీ కింగ్ సల్మాన్ కు సలహాదారుడు ఖాలిద్ అల్ ఫైసల్ వివిధ ప్రాంతాలలో  తనిఖీ చేశారు. సరస్సు మాదిరిగా ఉన్న ఒక రహదారి గుండా ఆయన కాన్వాయ్ ప్రయాణిస్తున్నట్లు ఒక వీడియోను మీరు ఇక్కడ గమనించవచ్చు. ప్రస్తుతం  ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో విద్యార్థుల భద్రత ను దృష్టిలో ఉంచుకొని తరగతులను రద్దు చేస్తున్నట్లు జెడ్డా విద్యాశాఖ సోషల్ మీడియాలో ప్రకటించింది. ఇదే తడి వాతావరణం గురువారం వరకు జెడ్డా, మక్కాలలో కొనసాగుతుందని వాతావరణ హెచ్చరికల విభాగం మరియు పర్యావరణ రక్షణ జనరల్ అథారిటీ తెలిపింది. విమాన రాకపోకలు మారిన వాతావరణంతో తీవ్ర  ప్రభావితమైంది, సౌదీ విమానయానశాఖ  వర్షం కారణంగా అనేక విమానాల రాకపోకలు ఆలస్యం కావచ్చని  ప్రకటించింది."మా గౌరవనీయమైన అతిథులకు మేము అత్యంత విలువ ఇస్తాం, ఆకస్మికంగా మారిన  ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా వారి ప్రయాణ ప్రణాళికలను మార్చడమో లేదా రద్దు చేసుకోవడమో జరుగుతున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వాతావరణా ప్రభావితంతో నిర్ధారణ బుకింగ్ ల ద్వారా జారీ కాబడిన ప్రభావిత టికెట్లకు ఎటువంటి నిబంధనలు, కోతలు లేకుండా మినహాయించాలని నిర్ణయం తీసుకొంటున్నట్లు సౌదీ విమానయానశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వాతావరణ సూచిక తెలిపిన వివరాల ప్రకారం సౌదీ దక్షిణ పశ్చిమ ప్రాంతాలలో వర్షం కురవవచ్చని వివరించింది. ఆ ప్రాంతంలో ఊస్ట్నోగ్రత  25 డిగ్రీ సెంటీగ్రేడ్ల స్థాయికి చేరుకొని ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. 2009 లో ఎర్ర సముద్ర నగరంలో 123 మంది చనిపోయారు, అదేవిధంగా రెండు సంవత్సరాల తరువాత 2011 లో ఇదేవిధంగా 10 మంది మరణించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com