హజ్ యాత్రికుల వసతి కమిటీలో ప్రొఫెసర్ షుకూర్
- November 21, 2017
హజ్ యాత్రికులకు సౌదీ అరేబియాలోని మక్కాలో వసతి సౌకర్యం కల్పించేందుకు భవనాలు ఎంపిక చేసే కమిటీకి తెలంగాణ హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ప్రొఫెసర్ ఎస్.ఎ.షుకూర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. మన దేశం నుంచి వెళ్లే హజ్ యాత్రికులకు మక్కాలో వసతి సౌకర్యం అందించే భవనాలను ఖరారు చేసే కేంద్ర హజ్ కమిటీ ప్రతినిధి బృందంలో ఆయన సభ్యులుగా ఉంటారు.
ఈ కమిటీ జనవరి రెండో వారంలో మక్కాను సందర్శించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వచ్చే ఆగస్టు నెలలో నిర్వహించే హజ్ యాత్రకు వెళ్లేందుకు ఈ ఏడాది అన్ని రాష్ట్రాల నుంచి 1.25 లక్షల మంది ముస్లింలకు అవకాశమిచ్చారు. తెలంగాణ నుంచి హజ్ కమిటీ పర్యవేక్షణలో 3,500 మందికి పైగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 70 ఏళ్లకు పైబడిన వారిని హజ్ యాత్రకు నేరుగా ఎంపిక చేస్తారు. మిగిలిన ఖాళీల్లో దరఖాస్తుదారులను డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. 2018లో హజ్ యాత్రకు వెళ్లాలనుకునే ముస్లింలు డిసెంబరు 17 వరకు దరఖాస్తులు పంపుకోవాలి.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!