దుబాయ్లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఘరానా మోసం
- November 21, 2017
హైదరాబాద్:మోసాల్లో ఆరితేరిన పలువురిని నిండా ముంచిన ఘరాన కి'లేడీ'పై రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ పీడీ చట్టం ప్రయోగించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ పట్టణం ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలోని లేబర్ కాలనీకి చెందిన తాటిపర్తి షీబారాణి(46) దుబాయ్లో ఉద్యోగం, వీసాలు ఇప్పిస్తామంటూ పలువురు నిరుద్యోగుల్ని మోసం చేసింది. బియ్యం, మాంసం వ్యాపారుల్నీ వంచించినందుకు ఇప్పటికే ఈమెపై 8 కేసులు నమోదయ్యాయి. వారణాసి విశ్వవిద్యాలయం నుంచి దూరవిద్య ద్వారా డిగ్రీ చేసిన ఆమె నగరానికి మకాం మార్చింది. 2000 సంవత్సరంలో సికింద్రాబాద్ చర్చిఫాదర్ జోయెల్తో పరిచయం పెంచుకుంది. దేశవ్యాప్తంగా అనాథాశ్రమాలను నడిపే అతడితో విదేశాలు తిరిగింది. 2010లో అతడు మరణించడంతో బయటికి వచ్చి బియ్యం, మాంసం వ్యాపారాల్లోకి దిగింది. ఉద్దెర ప్రాతిపదికన బియ్యం, మేకల్ని తీసుకొచ్చి వ్యాపారులకు డబ్బులివ్వకుండా సతాయించేది.
ఆమె ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో మిర్యాలగూడలో ఏడాదిపాటు జైలుపాలైంది. అనంతరమూ పద్ధతి మార్చుకోని ఆమె నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసింది. మొత్తం ఏడుగురిని రూ.87.45లక్షలకు మోసం చేసింది. అలాగే జవహర్నగర్ యాప్రాల్లో ఉంటూ పరిసర ప్రాంతాల్లోని సంపన్నకుటుంబాల మహిళతో పరిచయం పెంచుకునేది.
ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడే షీబారాణి తనకు అప్పుగా డబ్బు ఇచ్చేందుకు నిరాకరించే మహిళలతో గొడవలకు దిగేది. ఈ ఫిర్యాదులతో ఈనెల 14న జవహర్నగర్ పోలీసులు రిమాండ్కు తరలించారు. ఆమె నుంచి నాలుగు కార్లు, మూడు ద్విచక్రవాహనాలు, నాలుగు చరవాణుల్ని స్వాధీనం చేసుకొన్నారు. గత మూడు నెలల కాలంలోనే ఆమెపై నాలుగు కేసులు నమోదు కావడంతో కమిషనర్ ఆమెపై మంగళవారం పీడీ చట్టం ప్రయోగించారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







