శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 4 కోట్ల విదేశీ నోట్లు..!

- November 22, 2017 , by Maagulf
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 4 కోట్ల విదేశీ నోట్లు..!

శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయం బంగారం స్మగ్లింగ్ కే కాదు.... కోట్లాది రూపాయల ఫారెన్ కరెన్సీ తరలింపునకు అడ్డాగా మారుతోంది. నిన్న ఒక్క రోజే 4 కోట్ల విదేశీ నోట్లు పట్టు బడడం సంచలనం సృష్టించింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చరిత్ర లోనే ఇంత పెద్ద మొత్తంలో ఫారిన్ కరెన్సీ పట్టు బడడం ఇదే తొలిసారి. 

హైదరాబాద్ కేంద్రంగా గత కొన్ని రోజులుగా  విదేశాలకు పెద్ద మొత్తం లో ఫారిన్ కరెన్సీ తరలుతున్నట్లు గుజరాత్ రాష్ట్రం లోని అహ్మదాబాద్ పోలీసులకు సమాచారం అందింది. దీనిపై విచారణ చేసి, నిజానిజాలు నిర్ధారించుకున్న తర్వాత వారు హైదరాబాద్‌ పోలీసులకు ఉప్పందించారు. దీంతో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, సెంట్రల్ ఎక్సైజ్ కస్టమ్స్ అధికారులు 
గత 15 రోజులుగా ఎయిర్‌ పోర్టులో గట్టి నిఘా ఉంచారు. దీంతో పెద్ద ఎత్తున విదేశీ కరెన్సీ పట్టుబడింది. 
.
ఎమిరేట్స్ విమానంలో దుబాయ్‌ వెళ్లున్న రవూఫ్‌, అమన్ పై అధికారులకు అనుమానం కలిగింది. వారిని తనిఖీ చేయగా కుప్పలు తెప్పలుగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. ఇందులో ఏడు దేశాలకు నోట్స్ ఉన్నాయి. నిందితులకు ఎవరెవరితో సంబంధాలున్నాయి...? ఈ కరెన్సీ తరలింపు వెనుక ఉన్న అసలు సూత్రధారులు 
ఎవరెవరు అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com