3 రోజుల దుబాయ్‌ సూపర్‌ సేల్‌: నేడే ముగింపు

- November 25, 2017 , by Maagulf
3 రోజుల దుబాయ్‌ సూపర్‌ సేల్‌: నేడే ముగింపు

దుబాయ్‌ సూపర్‌ సేల్‌ నేటితో ముగియనుంది. తొలి రెండ్రోజులు దుబాయ్‌ సూపర్‌ సేల్‌కి అనూహ్యమైన స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు. 30 నుంచి 90 శాతం వరకు డిస్కౌంట్‌తో పలు బ్రాండెడ్‌ ఐటమ్స్‌ ఈ సూపర్‌ సేల్‌లో వినియోగదారుల్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. 1200 ఔట్‌లెట్స్‌, 300 బ్రాండ్స్‌ ఈ దుబాయ్‌ సూపర్‌ సేల్‌లో పాల్గొంటున్నాయి. హార్వే నికోలాస్‌, గ్యాలరీస్‌ లఫాయెట్టి, బ్లమింగ్‌డేల్స్‌, డెబెన్‌హామ్స్‌, హోమ్‌ సెంట్రో, ఐడి డిజైన్‌, రీస్‌, మ్యాక్స్‌ మారా, వూజా, కన్వర్స్‌ ఇంకా చాలా ప్రముఖ బ్రాండ్స్‌ ఈ సూపర్‌ సేల్‌లో వినియోగదారుల కోసం కొలువుదీరాయి. దుబాయ్‌ ఫెస్టివల్స్‌ అండ్‌ రిటెయిల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌, ఇటెయిల్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ అలయన్సెస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సయీద్‌ అల్‌ ఫలాసి మాట్లాడుతూ, మూడు రోజుల సూపర్‌ సేల్‌కి మంచి స్పందన లభిస్తోందనీ, నేటితో సేల్‌ ముగియనున్న దరిమిలా రికార్డు స్థాయిలో అమ్మకాలు జరగనున్నాయని చెప్పారు. గతంలో మే లో ఇదే తరహాలో సూపర్‌ సేల్‌ షాపింగ్‌ ప్రియుల్ని అలరించింది. అంతకు మించి ఇప్పుడు వినియోగదారులు దుబాయ్‌ సూపర్‌ సేల్‌ని ఆదరిస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com