ఆందోళనలతో అట్టుడుకుతున్న పాక్
- November 25, 2017
ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో పాకిస్తాన్ అల్లకల్లోలంగా మారింది. పాకిస్తాన్ న్యాయ శాఖామంత్రి జమీద్ అహ్మద్‌ను పదవినుంచి తొలగించాలంటూ 20 రోజులుగా దేశ రాజధాని ఇస్లామాబాద్‌లో ఆందోళనలు జరుగుతున్నాయి. తెహ్రిక్ ఏ లబాయిక్ యా రసూల్ అల్లా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కారులు ఇస్లామాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే రోడ్‌తో పాటు.. రావల్పిండికి వెళ్లే ఎక్స్‌ప్రెస్ హైవేను దిగ్భంధించారు. వీరికి సర్దిచెప్పడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో.. ఇవాళ పోలీసులను దింపింది ప్రభుత్వం. ఆందోళనకారులను చెదరగొట్టడానికి లాఠీఛార్జ్‌తో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. అయితే.. అదే స్థాయిలో నిరసనకారులు ప్రతిఘటించారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. కొంతమంది టియర్‌గ్యాస్‌ను కూడా ప్రయోగించినట్లు తెలుస్తోంది. దట్టమైన పొగతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. అటు ఆందోళనలు కరాచీ, లాహోర్, ఫైజలాబాద్, పెషావర్, సియాల్కోట్ లాంటి ఇతర ప్రాంతాలకూ పాకాయి. ఇస్లామాబాద్‌లో జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా వేలాది మంది కార్యకర్తలు వస్తుండడంతో.. పోలీసులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
ఓ వైపు ఈ ఆందోళనలను నిరోధించడం చేతగాని పాకిస్తాన్ ప్రభుత్వం.. మన పై అక్కసు వెళ్లగక్కడం మొదలుపెట్టింది. ఇస్లామాబాద్‌లో జరుగుతున్న ఆందోళనలకు మన దేశం మద్దతిస్తోందంటూ సాక్షాత్తూ పాక్ ఇంటీరియర్ మినిస్టర్ ఆషాన్ ఇక్బాల్ ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







