ఆందోళనలతో అట్టుడుకుతున్న పాక్

- November 25, 2017 , by Maagulf
ఆందోళనలతో అట్టుడుకుతున్న పాక్

ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో పాకిస్తాన్ అల్లకల్లోలంగా మారింది. పాకిస్తాన్ న్యాయ శాఖామంత్రి జమీద్ అహ్మద్‌ను పదవినుంచి తొలగించాలంటూ 20 రోజులుగా దేశ రాజధాని ఇస్లామాబాద్‌లో ఆందోళనలు జరుగుతున్నాయి. తెహ్రిక్ ఏ లబాయిక్‌ యా రసూల్ అల్లా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కారులు ఇస్లామాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే రోడ్‌తో పాటు.. రావల్పిండికి వెళ్లే ఎక్స్‌ప్రెస్ హైవేను దిగ్భంధించారు. వీరికి సర్దిచెప్పడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో.. ఇవాళ పోలీసులను దింపింది ప్రభుత్వం. ఆందోళనకారులను చెదరగొట్టడానికి లాఠీఛార్జ్‌తో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. అయితే.. అదే స్థాయిలో నిరసనకారులు ప్రతిఘటించారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. కొంతమంది టియర్‌గ్యాస్‌ను కూడా ప్రయోగించినట్లు తెలుస్తోంది. దట్టమైన పొగతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. అటు ఆందోళనలు కరాచీ, లాహోర్, ఫైజలాబాద్, పెషావర్, సియాల్‌కోట్ లాంటి ఇతర ప్రాంతాలకూ పాకాయి. ఇస్లామాబాద్‌లో జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా వేలాది మంది కార్యకర్తలు వస్తుండడంతో.. పోలీసులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

ఓ వైపు ఈ ఆందోళనలను నిరోధించడం చేతగాని పాకిస్తాన్ ప్రభుత్వం.. మన పై అక్కసు వెళ్లగక్కడం మొదలుపెట్టింది. ఇస్లామాబాద్‌లో జరుగుతున్న ఆందోళనలకు మన దేశం మద్దతిస్తోందంటూ సాక్షాత్తూ పాక్ ఇంటీరియర్‌ మినిస్టర్ ఆషాన్ ఇక్బాల్‌ ఆరోపణలు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com