డిసెంబర్ 6న ఢిల్లీలో ప్రవాసీల కోసం ప్రజావాణి
- November 26, 2017
ఢిల్లీ: 18 ఇసిఆర్ దేశాలకు ఉద్యోగానికి వలస వెల్లదలచినవారు, ఆయాదేశాల నుండి వాపస్ వచ్చినవారి సమస్యలను వినడానికి ప్రతినెల మొదటి బుధవారం డిల్లీలోని విదేశాంగ శాఖ, ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ (పిజిఇ) కార్యాలయంలో 'ఓపెన్ హౌజ్' (బహిరంగ వేదిక) ను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా డిసెంబర్ 6న బుధవారం ఢిల్లీ లోని చాణక్యపురి, అక్బర్ భవన్ లో గల పిజిఇ కార్యాలయంలో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గం.ల వరకు 'ఓపెన్ హౌజ్' కార్యక్రమం 'ప్రవాసి ప్రజావాణి' ని నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునేవారు పిజిఇ కార్యాలయం ఫోన్ నెం. 011 2467 3965 ఈ-మెయిల్: [email protected] కు సంప్రదించవచ్చు. సలహాలు, సహాయం కోసం తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ హెల్ప్ లైన్ నెంబర్ 81435 88886 కు కాల్ చేయవచ్చు. గల్ఫ్ వలసకార్మికులు చాలాదూరంలో ఉన్న ఢిల్లీకి వెళ్లడం కష్టమని, దేశంలోని 10 ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రంట్స్ (పిఓఇ) కార్యాలయాలు హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి, కొలకత్తా, చెన్నయి,చండీఘర్, కొచ్చిన్, త్రివేండ్రం, జైపూర్, రాయ్ బరేలి లలో 'ఓపెన్ హౌజ్' కార్యక్రమాలు నెలకు రెండుసార్లు నిర్వహించాలని ప్రవాసీలు కోరుతున్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!